'రేణిగుంట'కు సీక్వెల్... ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజయ్ సేతుపతి
- విజయ్ సేతుపతి చేతుల మీదుగా 'రేణిగుంట 2' ఫస్ట్ లుక్ విడుదల
- తొలి భాగానికి దర్శకత్వం వహించిన పనీర్ సెల్వమే ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత
- 2009లో వచ్చిన 'రేణిగుంట'కు సీక్వెల్‌గా ఈ సినిమా
- తొలి భాగాన్ని మించి గ్రిప్పింగ్‌గా ఉండనున్నట్లు చిత్ర వర్గాల వెల్లడి
- ప్రస్తుతం చివరి దశలో ఉన్న సినిమా షూటింగ్
2009లో విడుదలైన ‘రేణిగుంట’ చిత్రం విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకొని ఘన విజయం సాధించింది. బాల నేరస్థుల గృహం నుంచి తప్పించుకొని ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న ఐదుగురు యువకుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. అప్పటివరకు తమిళ ప్రేక్షకులు చూడని సరికొత్త క్రైమ్ ప్రపంచాన్ని పనీర్ సెల్వం ఆవిష్కరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ‘రేణిగుంట 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘రేణిగుంట 2’ మొదటి భాగం కంటే మరింత గ్రిప్పింగ్‌గా, వేగవంతమైన కథనంతో ఉండనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సీక్వెల్‌కు పనీర్ సెల్వం దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం.
ఈ చిత్రంలో జానీ, శాలి నివేకాస్, అభిమన్యు షామి తిలకన్, నిశాంత్, కనిఫా, తమిళసెల్వం, సుందీప్, వేలా రామమూర్తి, హరీశ్ పేరడి, సుజాత, సురభి తదితరులు నటిస్తున్నారు. మను రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా, ఆర్.బి. గురుదేవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. ఆంటోనీ ఎడిటింగ్, రాజశేఖర్ స్టంట్స్ అందిస్తున్నారు.