ఐపీఎల్ జట్ల ఎంపికలో యాజమాన్యాల పెత్తనం.. ఎస్ఆర్హెచ్పై లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు!
- ఐపీఎల్ జట్ల ఎంపికలో యాజమాన్యాల జోక్యం ఉంటుందని లివింగ్‌స్టోన్ ఆరోపణ
- ఓనర్లకు నచ్చిన ఆటగాడి కోసం తనను పక్కనపెట్టారని సంచలన వ్యాఖ్యలు
- ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగినా తనకు అవకాశం ఇవ్వలేదని వెల్లడి
- కోచ్ డాన్ వెటోరీ నిజం చెప్పడంతో పరిస్థితి అర్థమైందని వివరణ
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ లివింగ్‌స్టోన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. "ఐపీఎల్ 2026 వేలంలో ముంబై ఇండియన్స్‌కు గట్టి పోటీనిచ్చి సలీల్ అరోరా అనే యువ ఆటగాడిని మా ఫ్రాంచైజీ దక్కించుకుంది. అతనంటే మా ఓనర్లకు చాలా ఇష్టం. దీంతో అతడిని తుది జట్టులో కచ్చితంగా ఆడించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఒక దశలో కెప్టెన్ కమిన్స్ అందుబాటులో లేనప్పుడు మేము ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాం. అప్పుడు కూడా నాకు అవకాశం రాలేదు" అని లివింగ్‌స్టోన్ వివరించాడు.
ఈ విషయంపై తాను కోచ్ డాన్ వెటోరీని ప్రశ్నించగా, అసలు విషయం చెప్పాడని లివింగ్‌స్టోన్ తెలిపాడు. "కోచ్ వెటోరీ నాతో మాట్లాడుతూ.. 'ఆ కుర్రాడంటే ఓనర్లకు చాలా ఇష్టం. కమిన్స్ తిరిగి వచ్చినా సరే, జట్టు కూర్పులో మార్పులు ఉండవు' అని స్పష్టంగా చెప్పారు. ఆయన నిజాయతీగా చెప్పడంతో, గాయాల వంటివి జరిగితే తప్ప నాకు ఆడే అవకాశం రాదని అర్థమైంది. దాంతో నా ఆలోచనా విధానం కూడా మారిపోయింది" అని పేర్కొన్నాడు.
లివింగ్‌స్టోన్ ఇంకా మాట్లాడుతూ.. "జట్టు ఎంపికలో ఓనర్లు పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ, వారికి కచ్చితంగా కొంత అభిప్రాయం, పలుకుబడి ఉంటుంది" అని అభిప్రాయపడ్డాడు. ఇదే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న క్రికెట్ నిపుణుడు డేవిడ్ లాయిడ్ "ఈ యజమానులకు ఏ విధమైన నైపుణ్యం ఉంటుంది?" అని ప్రశ్నించగా, మరో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ "చాలా డబ్బు ఉంటుంది" అని చమత్కరించాడు.
కావ్య మారన్ సహ యజమానిగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, 2026 సీజన్లో ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. కాగా, లివింగ్‌స్టోన్ ఈ సీజన్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 1, 14 పరుగులు చేశాడు.