ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారత్‌కు షాక్.. ఇండియాను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి తైవాన్!
- ప్రపంచ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో భారత్ వెనుకంజ
- ఏఐ, సెమీకండక్టర్ల జోరుతో దూసుకెళ్లిన తైవాన్ మార్కెట్
- టీఎస్‌ఎంసీ షేర్ల దూకుడుతో పెరిగిన తైవాన్ మార్కెట్ విలువ
- విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో ఒత్తిడిలో భారత మార్కెట్లు
తైవాన్ ఈ ఘనత సాధించడం వెనుక కృత్రిమ మేధ (AI), సెమీకండక్టర్ల (చిప్) బూమ్ కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ చిప్ తయారీ సంస్థ అయిన ‘తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ’ (TSMC) షేర్లు గత ఏడాదిలో 130 శాతం మేర పెరిగాయి. ఎన్విడియా, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలకు ఏఐ చిప్‌లను సరఫరా చేస్తుండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు తైవాన్ మార్కెట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టారు.
ఇదే సమయంలో భారత మార్కెట్లు పలు ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల, రూపాయి క్షీణత వంటి కారణాలతో ఈ ఏడాది సెన్సెక్స్, నిఫ్టీలు 8 శాతం వరకు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) నిధులను ఉపసంహరించుకోవడం కూడా ఒత్తిడి పెంచుతోంది. అయినప్పటికీ, దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీల రూపంలో వస్తున్న పెట్టుబడులు భారత మార్కెట్‌కు అండగా నిలుస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.