బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ధర తెలిస్తే షాకే!
- ఇటీవల క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ను కలిసిన అల్లు అర్జున్
- ఆ సమయంలో బన్నీ చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌పై అందరి దృష్టి
- ఇది పాటెక్ ఫిలిప్ నాటిలస్ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ వాచ్
- మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ. 1.82 కోట్లకు పైనే
- ఐకాన్ స్టార్ స్టైల్‌కు, లైఫ్‌స్టైల్‌కు నిదర్శనమంటున్న ఫ్యాన్స్
అల్లు అర్జున్ ధరించిన ఈ వాచ్ ప్రపంచ ప్రఖ్యాత ‘పాటెక్ ఫిలిప్ నాటిలస్’ బ్రాండ్‌కు చెందినది. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారైన ఈ వాచ్ (మోడల్: 5712/1R-001) ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. సన్‌బర్స్ట్ బ్రౌన్ డయల్, మూన్ ఫేజ్, పవర్ రిజర్వ్ ఇండికేటర్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటోంది. దీని అందం, ఫీచర్ల మాట అటుంచితే, ధర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఈ అల్ట్రా లగ్జరీ వాచ్ అధికారిక రిటైల్ ధర సుమారు రూ. 90 లక్షలు. అయితే, మార్కెట్‌లో దీనికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా ప్రస్తుత మార్కెట్ ధర దాదాపు రూ. 1.82 కోట్లకు పైగా పలుకుతోంది. ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న అల్లు అర్జున్.. తన రిచ్ టేస్ట్‌కు, రాయల్ లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టుగానే ఈ ఖరీదైన వాచ్‌ను ఎంచుకున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు.