మొత్తం హెచ్ఆర్ విభాగాన్ని ఎత్తేసిన సీఈఓ.. కారణం ఇదే!
- పడిపోయిన ఫిన్టెక్ కంపెనీ బోల్ట్ ఆదాయం
- 30 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
- హెచ్ఆర్ విభాగంలో అందరినీ తీసేసిన వైనం
- వాళ్లు లేని సమస్యల్ని సృష్టిస్తున్నారని ఆరోపణ
- సౌకర్యాలు కోరుకునే సంస్కృతి పెరిగిందని విమర్శలు
కంపెనీ విలువ భారీగా పడిపోవడంతో రీస్ట్రక్చరింగ్లో భాగంగా ఏప్రిల్లో 30 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు బ్రెస్లో తెలిపారు. ఫార్చ్యూన్ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పెద్ద కంపెనీలకే హెచ్ఆర్ వ్యవస్థ సెట్ అవుతుందని, ఎదుగుతున్న తమలాంటి స్టార్టప్లకు పని పూర్తి చేయడంపై శ్రద్ధ పెట్టే టీమ్ మాత్రమే అవసరమని స్పష్టం చేశారు. కంపెనీలో పని చేయకుండా కేవలం సౌకర్యాలు కోరుకునే సంస్కృతి పెరిగిపోయిందని అందుకే వీరందరినీ తొలగించి వారానికి 4 రోజుల పని విధానాన్ని, అన్లిమిటెడ్ లీవ్స్ పాలసీలను రద్దు చేసినట్లు వెల్లడించారు.