ఐటీకి ఆద్యుడు చంద్రబాబే: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేదికపై శ్రీశ్రీ రవిశంకర్ కితాబు
- బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మానవతావాది అని కొనియాడిన సీఎం
- ఏపీని అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి
- ఐటీ సంస్కరణలకు చంద్రబాబే ఆద్యుడని కితాబిచ్చిన శ్రీశ్రీ రవిశంకర్
- చంద్రబాబు దార్శనికత వల్లే అమెరికాలో మినీ ఏపీ ఏర్పడిందని ప్రశంస
ఏపీ సీఎం చంద్రబాబు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రంలో జరిగిన సంస్థ 45వ వార్షికోత్సవ, శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదినం వేడుకలకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి సేవలను మరొకరు స్మరించుకుంటూ, వారి దార్శనికతను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీశ్రీ రవిశంకర్ కేవలం ఆధ్యాత్మిక గురువే కాదని, గొప్ప మానవతావాది అని అభివర్ణించారు. హింసలేని సమాజం, ఒత్తిడి రహిత జీవితం కోసం ఆయన చేస్తున్న ప్రపంచవ్యాప్త కృషిని అభినందించారు. "ప్రపంచంలో యుద్ధాల వల్ల భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రధాని నరేంద్ర మోదీ వంటి గొప్ప నేత మనకు ఉన్నారు. ఆయన నాయకత్వంలో దేశం అన్నింటినీ అధిగమిస్తోంది" అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నామని, అయితే సాంకేతికతతో పాటు మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలను ఏపీకి విస్తరించాలని, రాష్ట్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో గురూజీ సహకారం అందించాలని కోరారు.
అనంతరం శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో ఐటీ సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబేనని, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన ఘనత ఆయనదేనని కితాబిచ్చారు. "కొన్నేళ్ల క్రితం అమెరికా పర్యటనలో యువత పరివర్తనే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. నేడు ఆ లక్ష్యాన్ని ఆయన చేరుకున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్, వర్జీనియా వంటి ప్రాంతాలు మినీ ఆంధ్రప్రదేశ్‌ను తలపిస్తున్నాయి. అక్కడి ఐటీ ఉద్యోగుల్లో 60-70 శాతం మంది తెలుగువారే ఉన్నారు" అని శ్రీశ్రీ గుర్తుచేశారు. చంద్రబాబు దార్శనికత వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల ప్రముఖుల మధ్య అరుదైన కలయికకు వేదికైంది.