మంత్రి లోకేశ్‌ను కలిసిన స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ.. అండగా ఉంటామని భరోసా
- ఆసియా క్రీడలకు ఆర్చర్ జ్యోతి సురేఖ వరుసగా నాలుగోసారి ఎంపిక
- జ్యోతి సురేఖను అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
- ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా
అంతర్జాతీయ విలువిద్యలో అద్భుత ప్రతిభతో రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ.. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిష్ఠాత్మక 2026 ఆసియా క్రీడలకు ఆమె వరుసగా నాలుగోసారి ఎంపికైన నేపథ్యంలో, ఈ రోజు ఉదయం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జ్యోతి సురేఖను మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. తన ప్రతిభతో విలువిద్యలో నిలకడగా రాణిస్తూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. రానున్న ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటి, దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. క్రీడాకారిణిగా ఆమెకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లోకేశ్‌తో పాటు మరో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. జ్యోతి సురేఖ సాధించిన విజయాలను వారు కొనియాడారు.