రేపు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
- కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి
- సీఐఐ బిజినెస్ సమ్మిట్ కు హాజరు కానున్న చంద్రబాబునాయుడు
- రేపు రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస
మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ఆయన హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతిఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు.