సచివాలయంపై డ్రోన్ కలకలం.. తప్పుడు ప్రచారమంటూ ప్రభుత్వం ఆగ్రహం

Andhra Pradesh Secretariat Drone Scare Government Denies Rumors
  • ఏపీ సచివాలయంపై డ్రోన్ సంచరించిందంటూ కలకలం
  • ఇది తప్పుడు ప్రచారమంటూ తీవ్రంగా ఖండించిన ప్రభుత్వం
  • సచివాలయంపై కనిపించింది డ్రోన్ కాదు, విమానమని స్పష్టీకరణ
  • కలెక్టర్ల సమావేశం నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రచారమని సర్కార్ అనుమానం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంపై డ్రోన్ సంచరించిందంటూ వ్యాపించిన వార్తలు తీవ్ర కలకలం రేపాయి. అయితే ఈ ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అది డ్రోన్ కాదని, ఒక వాణిజ్య విమానమని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరుగుతున్న సమయంలో ఈ వదంతులు వ్యాపించాయి. దీంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.

పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సచివాలయంపై కనిపించింది డ్రోన్ కాదని, ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న AI2903 విమానమని తేల్చారు. షెడ్యూల్ ప్రకారం ల్యాండింగ్ కోసం ఆ విమానం నిర్దేశిత మార్గంలోనే ప్రయాణించిందని వివరించారు. కలెక్టర్ల సమావేశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేశారని ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
Go Back to Shorts
Andhra Pradesh Secretariat
Secretariat Drone
Andhra Pradesh
Chandrababu Naidu
Vijayawada Airport
AI2903 flight
Collectors Meeting
Fake News
Drone Hoax
Security Breach

More Telugu News