ఏమిటీ హంటావైరస్... ప్రమాదకరమైనదా?
- విహార నౌకలో వెలుగు చూసిన హంటావైరస్ వ్యాప్తి
- ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు మృతి
- పలు దేశాలకు పాకిన వైరస్.. అధికారుల అప్రమత్తత
- మనిషి నుంచి మనిషికి వ్యాపించే అరుదైన వైరస్‌గా గుర్తింపు
- ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువేనన్న డబ్ల్యూహెచ్ఓ
ఎంవీ హోండియస్ అనే విలాసవంతమైన విహార నౌకలో హంటావైరస్ వ్యాప్తి చెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ధృవీకరించింది. ఈ షిప్‌తో సంబంధం ఉన్న ఐదుగురికి వైరస్ సోకినట్టు తేలింది. అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఈ నౌకలో ఇప్పటికే ముగ్గురు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో డచ్ దంపతులు, ఒక జర్మన్ జాతీయుడు ఉన్నారు.
ప్రస్తుతం ఈ షిప్లో 23 దేశాలకు చెందిన 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కఠినమైన ఆరోగ్య జాగ్రత్తల మధ్య ఉన్నారు. ఈ నౌక స్పెయిన్‌లోని టెనెరైఫ్ దీవులకు ఈ వారాంతంలో చేరుకోనుంది. అక్కడి నుంచి ప్రయాణికులను వారి వారి దేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. షిప్ నుంచి దిగి వెళ్లిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, యూకే, యూఎస్ఏ, సింగపూర్ వంటి దేశాలకు చేరింది. ఆయా దేశాల్లోని వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
అయితే, ఇది కోవిడ్ తరహాలో పెద్ద మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 1 నుంచి 6 వారాలు ఉండటంతో మరికొన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. షిప్ ఎక్కకముందే అర్జెంటీనా, చిలీ వంటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రయాణికులకు ఈ వైరస్ సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. షిప్ ఆపరేటర్లు ప్రయాణికుల వివరాలు సేకరించి కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సహకరిస్తున్నారు.