బెంగాల్లో ముస్లిం వ్యక్తి అంతిమయాత్ర చూసి సంబరాలు నిలిపేసిన బీజేపీ కార్యకర్తలు!
- 294 సీట్లకు గాను 207 స్థానాల్లో బీజేపీ ఘన విజయం
- పార్టీ గెలవడంతో బీజేపీ కార్యకర్తల సంబరాలు
- అంత్యక్రియల ఊరేగింపును చూసి కాసేపు సంబరాలు ఆపేసిన కార్యకర్తలు
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. 294 స్థానాలకు గాను బీజేపీ 207 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ మూడింట రెండొంతులకు పైగా సీట్లను సాధించింది. 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్‌ను మట్టికరిపించి బీజేపీ చరిత్రను సృష్టించింది. దీంతో బెంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
సుదీర్ఘ కాలం పోరాటం తర్వాత గెలిచినప్పటికీ, బీజేపీ కార్యకర్తలు రాజకీయం కంటే మానవత్వం గొప్పదని చాటిచెప్పారు. పార్టీ గెలిచిన ఆనందంలో కమలం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. డప్పులు, జైశ్రీరామ్ నినాదాలతో పండుగ వాతావరణం కనిపించింది. అంతలోనే ఒక ముస్లిం వ్యక్తి అంతిమయాత్రను గమనించిన కార్యకర్తలు, తమ సంబరాలను కాసేపు నిలిపివేశారు. నిశ్శబ్దంగా వారికి అంత్యక్రియల ఊరేగింపునకు దారి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.