దీదీకి భారీ షాక్.. మెజారిటీ మార్క్‌ను దాటిన బీజేపీ!

Mamata Banerjee Shock BJP Crosses Majority Mark in West Bengal
  • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా
  • మెజారిటీ మార్క్‌ను దాటి అధికారం దిశగా కమలం పార్టీ
  • నాలుగోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న తృణమూల్‌కు ఎదురుదెబ్బ
  • మమతా బెనర్జీపై ఆమె నియోజకవర్గంలోనే పోటీ చేసిన సువేందు 
  • 2021లో 215 సీట్లు గెలిచిన టీఎంసీ ఈసారి వెనుకంజ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభంజనం సృష్టిస్తోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, బీజేపీ ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్క్‌ను దాటేసింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వెనుకంజలో ఉంది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలు ఉండగా, అధికారం చేపట్టాలంటే 148 సీట్లు గెలవాల్సి ఉంటుంది. తాజా ఫలితాల సరళి ప్రకారం బీజేపీ ఈ మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటినట్లు స్పష్టమవుతోంది. గతంలో మమతకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా మారిన సువేందు అధికారి ఈ ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా, మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలోనే సువేందు ఆమెపై పోటీకి దిగడంతో ఈ పోరుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ ఆయ‌న వెనుకంజలో ఉన్నారు. 

2021 ఎన్నికల్లో టీఎంసీ 215 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అప్పుడు నందిగ్రామ్‌లో సువేందు చేతిలో ఓడిపోయిన మమత, భవానీపూర్ ఉపఎన్నికలో గెలిచి సీఎం పదవిని నిలబెట్టుకున్నారు. ఈసారి మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయి. కాంగ్రెస్-లెఫ్ట్ ఫ్రంట్ కూటమితో పాటు, టీఎంసీ నుంచి సస్పెండైన హుమాయున్ కబీర్ కొత్త పార్టీ పెట్టడం కూడా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసింది.

ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగ్గా, ఈసారి ఏ పార్టీ గెలుస్తుందోనని ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టంగా అంచనా వేయలేకపోయాయి. అయితే, ఓటర్ల తీర్పు మాత్రం బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతమిచ్చింది.
Go Back to Shorts
West Bengal Election Results 2026
Mamata Banerjee
BJP Victory
Suvendu Adhikari
TMC
West Bengal Assembly Elections
Bhawanipore Constituency
Indian Politics
Election Results
Political News

More Telugu News