నేను ఇరాన్‌పై యుద్దం చేయకుంటే పశ్చిమాసియా, యూరప్ ముక్కలయ్యేవి : డొనాల్డ్ ట్రంప్
- ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశం అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నామన్న ట్రంప్
- అలా చేయకపోయి ఉంటే యూరప్ దేశాలు ముక్కలైపోయేవన్న ట్రంప్
- ఇరాన్ వైమానిక, నౌకాదళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్న ట్రంప్
తమతో యుద్ధం తర్వాత ఇరాన్ నాయకత్వం బలహీనపడిందని, ఆ దేశ సైనిక సామర్థ్యం గణనీయంగా క్షీణించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకున్నామని తెలిపారు. ఒకవేళ తాను అలా చేయకపోయి ఉంటే పశ్చిమాసియా, యూరప్ దేశాలు ముక్కలైపోయేవని అన్నారు.
ఇరాన్ అనే అందమైన దేశంలోకి వెళ్లి వారి వద్ద అణ్వాయుధాలు లేవని మనం నిర్ధారించుకోవాలని వ్యాఖ్యానించారు. బీ2 బాంబర్లతో వారిని అడ్డుకున్నట్లు చెప్పారు. అమెరికా అలా చేయకపోయి ఉంటే వారి వద్ద అణ్వాయుధాలు ఉండేవని, అప్పుడు ఇజ్రాయెల్, పశ్చిమాసియాతో సహా యూరప్ దేశాలు ముక్కలుగా పేలిపోయి ఉండేవని వ్యాఖ్యానించారు. తమ సైనిక చర్యతో ఇరాన్ నాశనమైందని అన్నారు. వారి వైమానిక, నౌకాదళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు.
శాంతిచర్చలు తాను ఆశించినవిధంగా జరగడం లేదని అన్నారు. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయని, యుద్ధం ఆగిపోతే తగ్గుతాయని పేర్కొన్నారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలనుకుంటోందని కానీ వారి ప్రతిపాదన సంతృప్తికరంగా లేదని అన్నారు. ఇరాన్‌లో నాయకత్వం విచ్ఛిన్నం అయిందని, అక్కడ నాలుగైదు గ్రూపులు ఉన్నాయని, అందుకే ఒప్పందం విషయంలో గందరగోళం నెలకొందని అన్నారు.