కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ పూజలు

Abhishek Sharma Offers Prayers at KarmanGhat Hanuman Temple
  • కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన అభిషేక్ శర్మ
  • స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పంచుకోవడంతో వైరల్
  • గతంలోనూ పలు ఆలయాలను సందర్శించిన ఎస్ఆర్ హెచ్ ఆటగాళ్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ శనివారం నాడు హైదరాబాద్ నగరంలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆలయానికి చేరుకున్న అభిషేక్ శర్మకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అభిషేక్ శర్మ గర్భగుడిలో స్వామివారికి అభిషేకం జరిపించాడు.

ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను అభిషేక్ శర్మ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. "కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయగా, ఈ ఫోటోలు కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు, నెటిజన్లు పెద్ద సంఖ్యలో లైక్స్, కామెంట్లతో స్పందిస్తున్నారు.

కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నగరంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా పలువురు ఎస్ఆర్ హెచ్ ఆటగాళ్లు బల్కంపేట ఎల్లమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి ఆలయాలను సందర్శించి పూజలు చేసిన విషయం తెలిసిందే. 
Go Back to Shorts
Abhishek Sharma
Sunrisers Hyderabad
SRH
KarmanGhat Hanuman Temple
Hyderabad Temples
Balkampet Yellamma Temple
Peddamma Temple
IPL
Cricket

More Telugu News