ఓటీటీ తెరపైకి ప్రదీప్ రంగనాథన్ మూవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటీటీ తెరపైకి ప్రదీప్ రంగనాథన్ మూవీ!

LIK Movie Update
  • ప్రదీప్ రంగనాథన్ నుంచి 'ఎల్ ఐ కె'
  • 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా 
  • 60 కోట్ల దగ్గరే ఆగిపోయిన వసూళ్లు 
  • ఈ నెల 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో

ప్రదీప్ రంగనాథన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తోందంటే, యూత్ ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటుంది. అందువలన యూత్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఆయన నుంచి వచ్చిన తాజా చిత్రమే 'లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ'( LIK). విఘ్నేశ్ శివన్ తన సొంత బ్యానర్ పై తెరకెక్కించిన సినిమా ఇది. కృతి శెట్టి కథానాయికగా అలరించిన ఈ సినిమాను, ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. 

గతంలో ప్రదీప్ చేసిన సినిమాలన్నీ చాలా తేలికగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. దాంతో ఈ సినిమా కూడా ఒక రేంజ్ లో వసూళ్లను కొల్లగొడుతుందని భావించారు. ఆ నమ్మకంతోనే 100 కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. అయితే ఈ సినిమా 60 కోట్ల దగ్గరే తన జోరును తగ్గించింది. 100 కోట్ల మార్క్ ను టచ్ చేయలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 6వ తేదీ నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన 'అమెజాన్ ప్రైమ్' నుంచి వచ్చేసింది. 

ఇది లవ్ స్టోరీనే .. కాకపోతే ఇప్పటి కాలానికి చెందిన ప్రేమకథ కాదు. 2040లో ప్రేమలు ఎలా ఉండబోతున్నాయి? అనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అప్పటి యూత్ ధోరణి ఎలా ఉంటుంది? వాళ్ల ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అనేవి వినోదభరితంగా చూపించే ప్రయత్నం చేశారు. సైంటిఫిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి. 
Advertisement
Pradeep Ranganathan
Life Insurance Company
LIK Movie
Krithi Shetty
Amazon Prime
OTT Release
Telugu Movie Review
2040 Love Story
Vignesh Shivan
Romantic Comedy

More Telugu News