వద్దని బతిమాలినా, వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేశారు: కేసీఆర్‌పై కడియం శ్రీహరి ఆగ్రహం

Kadiyam Srihari fires at KCR
  • పైకి వరంగల్ జిల్లా అని చెప్పుకోవడం తప్ప మిగిలిందేమీ లేదన్న కడియం శ్రీహరి
  • కేసీఆర్ అహంకారం నచ్చకపోవడం వల్లే నాయకులు దూరం జరుగుతున్నారని వ్యాఖ్య
  • నాడు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్‌లో చేరిన వారికి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని ఆగ్రహం
వరంగల్ జిల్లాను కేసీఆర్ ఆరుముక్కలు చేశారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. జిల్లాను ముక్కలు చేయవద్దని తాను బతిమాలినప్పటికీ, ఆరు ముక్కలు చేసి ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పైకి వరంగల్ జిల్లా అని చెప్పుకోవడం తప్ప మిగిలిందేమీ లేదని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ అహంకారం నచ్చకపోవడంవల్లే కొందరు నాయకులు దూరంగా ఉంటున్నారని అన్నారు.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 36 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నారని విమర్శించారు. పార్టీలో చేరిన వారు ఎవరూ రాజీనామా చేయకపోయినప్పటికీ మంత్రి పదవులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు.

మీరు చేస్తే రాజకీయం, ఇతరులు చేస్తే వ్యభిచారమా అని నిలదీశారు. ఇది కేసీఆర్ నేర్పిన విద్యే అన్నారు. కేసీఆర్ తీరు నచ్చకపోవడం వల్లే ఆయన నాయకత్వం నుంచి చాలామంది బయటకు వస్తున్నారని అన్నారు. కేసీఆర్ అహంకారం ఎవరికీ నచ్చడం లేదని అన్నారు.
Advertisement
Kadiyam Srihari fires at KCR
Warangal district
Congress leader Kadiyam Srihari

More Telugu News