శృంగార సన్నివేశాల్లో కట్ చెప్పినా హీరోలు ఆగరు.. అన్నూ కపూర్ సంచలన వ్యాఖ్యలు

Annu Kapoor Comments on Bollywood Intimate Scenes
  • ఇంటిమేట్ సీన్లలో హీరోలు శ్రుతిమించుతారన్న అన్నూ కపూర్
  • డైరెక్టర్ కట్ చెప్పినా ఆగకుండా కంటిన్యూ చేస్తారని ఆరోపణ
  • ఒక హీరో వల్ల నటి రెండు రోజులు గది దాటలేదని వెల్లడి
  • పాత రోజుల్లో ఇంటిమసీ కోఆర్డినేటర్లు లేకపోవడమే కారణమని వ్యాఖ్య
బాలీవుడ్ సీనియర్ నటుడు అన్నూ కపూర్ చిత్ర పరిశ్రమలో ఇంటిమేట్ సన్నివేశాల చిత్రీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు హీరోలు డైరెక్టర్ 'కట్' చెప్పినా ఆగకుండా శ్రుతిమించి ప్రవర్తిస్తారని, తాను అలాంటి సంఘటనలను స్వయంగా చూశానని ఆయన ఆరోపించారు. ఇటీవల సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ షోలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక పాత సంఘటనను గుర్తుచేసుకుంటూ "ఒక ఇంటిమేట్ సీన్ చిత్రీకరణ సమయంలో హీరో అదుపుతప్పాడు. డైరెక్టర్ కట్ చెప్పినా ఆగలేదు. దీంతో ఆ నటి అతడి నుంచి బలవంతంగా తప్పించుకుని పారిపోవాల్సి వచ్చింది. ఆ ఘటనతో ఆమె ఎంతగానో భయపడి, రెండు రోజుల పాటు తన గది నుంచి బయటకు రాలేదు" అని అన్నూ కపూర్ వివరించారు. 

ఒకప్పుడు సెట్స్‌లో ఇంటిమసీ కోఆర్డినేటర్ల వ్యవస్థలు లేవని, ఆ సమయంలో కొందరు ఇలాంటి పరిస్థితులను అవకాశంగా తీసుకునేవారని ఆయన తెలిపారు. అయితే తాను ఎప్పుడూ వృత్తిపరంగానే వ్యవహరించానని, సహనటీనటుల సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. అన్నూ కపూర్ తాజా వ్యాఖ్యలతో సినిమాల్లో సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీనటుల భద్రత, వృత్తిపరమైన ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఆయన ఈ సంఘటనలో ఉన్న నటీనటుల పేర్లను బయటపెట్టలేదు.
Go Back to Shorts
Annu Kapoor
Bollywood
Intimate Scenes
Movie Shooting
Sexual Harassment
Siddharth Kannan
Actress Safety
Film Industry

More Telugu News