అసోంలో బీజేపీ హవా, పుదుచ్చేరిలో ఎన్డీయే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు

Assam Exit Poll 2026
  • 126 స్థానాలకు బీజేపీకి 80కి పైగా సీట్లు వస్తాయన్న సర్వేలు
  • కాంగ్రెస్ కూటమి 30 లోపు సీట్లకే పరిమితమవుతుందన్న సర్వేలు
  • పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈరోజు రెండో దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

అసోంలో 126 స్థానాలకు గాను బీజేపీ కూటమి 80కి పైగా సీట్లు గెలుచుకుంటుందని వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 30 సీట్లకే పరిమితం కానుంది. ఇతరులు 1 నుంచి 10 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి.

30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలోనూ ఎన్డీయే మెజార్టీకి కావాల్సిన సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ, మిత్రపక్షాలు 16 సీట్లకు పైగా గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

అసోం ఎగ్జిట్ పోల్స్

యాక్సిస్ మై ఇండియా : బీజేపీ 88 - 100, కాంగ్రెస్ 24 - 26 సీట్లు
పీపుల్స్ పల్స్: బీజేపీ 68 - 72, కాంగ్రెస్ 22 - 26 సీట్లు
పీ-మార్క్: బీజేపీ 82 - 94, కాంగ్రెస్ 30 - 40 సీట్లు
మాట్రిజ్ : బీజేపీ 85 - 96, కాంగ్రెస్ 25 - 32 సీట్లు
పీపుల్స్ ఇన్‌సైట్ : బీజేపీ 88 - 96, కాంగ్రెస్ 30 - 34 సీట్లు
జేవీసీ ఎగ్జిట్ పోల్: బీజేపీ 88 - 101, కాంగ్రెస్ 23 - 33 సీట్లు

పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్ పల్స్ : ఎన్డీయే 16 - 19, కాంగ్రెస్ 10 - 12 సీట్లు
చాణక్య స్ట్రాటజీస్ : ఎన్డీయే 17 - 20, కాంగ్రెస్ 9 - 13 సీట్లు
యాక్సిస్ మై ఇండియా :     ఎన్డీయే 16 - 20, కాంగ్రెస్ 6 - 8 సీట్లు
Go Back to Shorts
Assam Exit Poll 2026
Assam Polls
Puducherry Exit Poll 2026

More Telugu News