యూఏఈ కీలక నిర్ణయం... ఒపెక్ గ్రూపు నుంచి బయటకు...!

UAE To Quit Oil Exporting Groups OPEC OPEC
  • ఒపెక్, ఒపెక్ ప్లస్ గ్రూపుల నుంచి బయటకొచ్చిన యూఏఈ
  • మే 1వ తేదీ నుంచి అమల్లోకి నిర్ణయం
  • దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నుంచి బయటకు వచ్చింది. మే 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని యూఏఈ తెలిపింది. చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్)లో చాలా ఏళ్లుగా యూఏఈ సభ్యదేశంగా ఉంది. ఒపెక్ ఏర్పాటైన ఏడేళ్ల తర్వాత 1967లో యూఏఈ ఇందులో చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సుదీర్ఘకాలం పాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కూటమి నుంచి బయటకు రావడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో, ఉత్పత్తి పెంపు విషయంలో తలెత్తిన అంతర్గత విబేధాల నేపథ్యంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా, ప్రాంతీయ మిత్ర దేశాలు సరైన విధంగా స్పందించకపోవడం వల్ల యూఏఈ ఇప్పటికే అసంతృప్తితో ఉంది.
Advertisement
UAE To Quit Oil Exporting Groups OPEC
OPEC+

More Telugu News