ఏపీలో ఎక్సైజ్ పోలీసులకు ఊరట.. బార్ల ఫొటోల నిబంధనలో కీలక మార్పు
- బార్ల ఫొటోలు తీసే నిబంధనపై ఎక్సైజ్ పోలీసులకు ఊరట
- విశాఖలో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతితో మారిన నిబంధన
- ఇకపై సీసీటీవీ ఫుటేజ్ లేదా వీడియో కాల్ ద్వారా బార్ల మూసివేత నిర్ధారణ
- మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల తక్షణ సాయం.. ఉద్యోగం ఇస్తామని మంత్రి హామీ
- రూ.1.10 కోట్ల బీమా సాయం అందేలా చూస్తామని వెల్లడి
ఏపీలో ఎక్సైజ్ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. బార్‌లు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్న నిబంధనను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిబంధనలో మార్పులు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
విశాఖపట్నం సీతమ్మధార ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సింహాచలం నాయుడు, గురువారం అర్ధరాత్రి విధి నిర్వహణలో భాగంగా బార్ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేశారు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా తాటిచెట్లపాలెం వద్ద వేగంగా వచ్చిన ఓ బైక్ ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఎక్సైజ్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ దురదృష్టకర సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఇకపై ఎక్సైజ్ పోలీసులు అర్ధరాత్రి నేరుగా బార్లకు వెళ్లి ఫొటోలు తీయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బార్ మూసివేతను నిర్ధారించుకోవడానికి సీసీ కెమెరాల వీడియో ఫుటేజ్‌ను పరిశీలించడం లేదా బార్ సిబ్బందికి వీడియో కాల్ చేయడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవచ్చని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
మృతుడి కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి
మరోవైపు మృతుడు సింహాచలం నాయుడు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ఆయన కుటుంబానికి ఎక్సైజ్ శాఖ తరఫున తక్షణమే రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. దీంతో పాటు ఎస్‌బీఐ బీమా పథకం ద్వారా రూ.1.10 కోట్ల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, సింహాచలం కుటుంబంలో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి ప్రకటించారు.