నేడు కవిత కొత్త పార్టీ.. 'తెలంగాణ ప్రజా జాగృతి' ఆవిర్భావానికి సర్వం సిద్ధం
- 'తెలంగాణ ప్రజా జాగృతి' (టీపీజే) పేరుతో కొత్త పార్టీని ప్రకటించనున్న కవిత
- శనివారం మేడ్చల్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జెండా ఆవిష్కరణ
- బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదాలు, సస్పెన్షన్ తర్వాత సొంత పార్టీ ఏర్పాటు
- కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై పోరాటమే తమ పార్టీ విధానమని వెల్లడి
- సభకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, 50 వేల మంది కార్యకర్తలు హాజరు
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. 'తెలంగాణ ప్రజా జాగృతి' (టీపీజే) పేరుతో శనివారం తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకోసం మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌లో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకత్వంతో తీవ్ర విభేదాలతో ఉన్న కవిత, పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో ఆమె సొంత పార్టీని స్థాపిస్తున్నారు. శనివారం ఉదయం 7:30 గంటలకు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి, గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మేడ్చల్‌లోని సభా ప్రాంగణానికి చేరుకుని, ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా సుమారు గంటన్నర పాటు ప్రసంగించి, పార్టీ విధివిధానాలను, భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించనున్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులు, మేధావులతో పాటు 33 జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది కార్యకర్తలు, మద్దతుదారులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టగా, స్వాగత ద్వారాలకు కాళోజీ, రాణి రుద్రమదేవి వంటి తెలంగాణ ప్రముఖుల పేర్లను పెట్టారు.
పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో పార్టీ జెండాను రూపొందించినట్లు సమాచారం. పసుపు శుభసూచకంగా, ఆకుపచ్చ రైతులు, వ్యవసాయ రంగానికి చిహ్నంగా, నీలం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటానికి సంకేతంగా ఈ రంగులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్‌తో పాటు, తన పాత పార్టీ బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ విధానాలపై ప్రజాపక్షాన నిలబడి పోరాడటమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని కవిత వర్గీయులు చెబుతున్నారు.
ఇటీవల ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి సుమారు 5 నెలల పాటు జైలు జీవితం గడిపిన కవిత, కొద్ది రోజుల క్రితమే సీబీఐ కోర్టు నుంచి క్లీన్‌చిట్ పొందారు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త పార్టీ ఏర్పాటు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. సభకు విచ్చేస్తున్న అతిథుల కోసం తలకాయ కూర, నాటుకోడి పులుసు, జొన్న రొట్టెలు వంటి 34 రకాల తెలంగాణ వంటకాలతో భారీ భోజన ఏర్పాట్లు కూడా చేశారు.