మరో సెంచరీ బాదిన సంజూ... సీఎస్కే భారీ స్కోరు
- ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిన సంజూ శాంసన్
- 54 బంతుల్లో 101 పరుగులతో అజేయ శతకం
- ఈ సీజన్‌లో శాంసన్‌కు ఇది రెండో సెంచరీ
- నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
- ముంబై ఇండియన్స్ ముందు 208 పరుగుల భారీ లక్ష్యం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ఇన్నింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్ (22) వేగంగా ఆరంభించినా, ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా, సంజూ శాంసన్ మాత్రం ఒక వైపు క్రీజులో పాతుకుపోయి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి డివాల్డ్ బ్రెవిస్ (21), జేమీ ఓవర్టన్ (15) నుంచి కొంత సహకారం లభించింది.
ముంబై బౌలర్లలో ఏఎం గజన్‌ఫర్, అశ్విని కుమార్ చెరో రెండు వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లలోనే 38 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబై ఇండియన్స్ విజయానికి 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.