ఐదేళ్ల తర్వాత.. చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించిన భారత్
- గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్, చైనా మధ్య నిలిచిన టూరిస్ట్ వీసాలు
- తాజాగా, పర్యాటక వీసాలపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ
- చైనా, హాంకాంగ్ పౌరులకు వీసాలు జారీ చేయడం కోసం మార్గదర్శకాలు
మీడియా కథనాల మేరకు, పర్యాటక వీసాలపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, చైనా, హాంకాంగ్ పౌరులకు పర్యాటక వీసాలు జారీ చేయడం కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలుస్తోంది.
దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి గత సంవత్సరం నుంచి ఆంక్షల సడలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరుదేశాల ఒప్పందంతో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. కైలాస్ మానస సరోవర్ యాత్రను కూడా తిరిగి ప్రారంభించారు.