కేసీఆర్ తన కళ్లతో బీఆర్ఎస్ అంతం కావడం చూడాలని కోరుకుంటున్నాం: ధర్మపురి అర్వింద్

Dharmapuri Arvind lashes out at BRS and Congress
  • కేసీఆర్‌ను అందరికంటే ఎక్కువగా కేటీఆర్, కవితలే హింసిస్తున్నారని వ్యాఖ్య
  • వారికి ఫ్లైట్ టిక్కెట్ ఇచ్చి పంపిస్తే కేసీఆర్, తెలంగాణ దరిద్రం పోతుందన్న అర్వింద్
  • కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న అర్వింద్
కేసీఆర్ తన కళ్లతో బీఆర్ఎస్ అంతమవడం చూడాలని తాము కోరుకుంటున్నామని, అది కూడా త్వరలో జరుగుతుందని నమ్ముతున్నామని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కేసీఆర్‌ను అందరికంటే ఎక్కువగా కేటీఆర్, కవిత, హరీశ్ రావులే హింసిస్తున్నారని ఆరోపించారు. కవిత, కేటీఆర్‌లకు ఫ్లైట్ టిక్కెట్ ఇచ్చి పంపిస్తే కేసీఆర్ దరిద్రంతో పాటు తెలంగాణ దరిద్రం కూడా వదులుతుందని వ్యాఖ్యానించారు.

అర్వింద్ రైతుల సమస్యలపై కూడా మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. రైతుల గోడును పట్టించుకునే వారే కరవయ్యారని అన్నారు. ఈ సందర్భంగా పసుపు రైతులకు ఆయన కీలక హామీ ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి తప్పుకునే లోపు పసుపు పంటకు క్వింటాల్‌కు రూ.30 వేల మద్దతు ధర పలికించి తీరుతానని అన్నారు. రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు.
Advertisement
Dharmapuri Arvind responds on KCR meeting
Arvind fires at KCR
Telangana BJP

More Telugu News