తన ఫొటోలతో ప్రచారం చేసుకున్నారంటూ తమన్నా పిటిషన్.. కొట్టివేసిన హైకోర్టు
- తమన్నా, పవర్ సోప్స్ మధ్య 2008లో కుదిరిన ఒప్పందం
- 2009 అక్టోబర్ వరకు ప్రచారానికి అనుమతి
- 2010-11లలోనూ పవర్ సోప్స్ తన ఫొటోలతో ప్రచారం చేసిందని కోర్టుకు వెళ్లిన తమన్నా
- సాక్ష్యాలు చూపలేదంటూ పిటిషన్ కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు
అయితే ఒప్పందం గడువు ముగిసినప్పటికీ 2010-2011 మధ్య ఈ సంస్థ తన ఫొటోలను అనుమతి లేకపోయినప్పటికీ ఉపయోగించుకుందని తమన్నా ఆరోపించారు. ఇందుకు గాను తనకు రూ.1 కోటి పరిహారం నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ఇందుకు సంబంధించి సాక్ష్యాలు చూపలేదంటూ కోర్టు తమన్నా పిటిషన్‌ను కొట్టివేసింది.