కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్... ఆర్సీబీకి మరో గెలుపు
- లక్నోపై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం
- నాలుగు వికెట్లతో చెలరేగిన యువ బౌలర్ రసిఖ్ సలామ్ దార్
- 146 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్
- 49 పరుగులతో రాణించిన విరాట్ కోహ్లీ
- 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్లు సమష్టిగా రాణించి లక్నోను తక్కువ స్కోరుకే కట్టడి చేయగా, బ్యాటర్లు సమర్థంగా లక్ష్యాన్ని ఛేదించారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి బౌలర్లు శుభారంభం ఇచ్చారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లక్నో బ్యాటింగ్ లైనప్‌పై ఒత్తిడి పెంచారు. ఫలితంగా లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో మిచెల్ మార్ష్ (40), ఆయుష్ బదోని (38), ముకుల్ చౌదరి (39) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో యువ పేసర్ రసిఖ్ సలామ్ దార్ 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో రాణించాడు.
అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 49) గట్టి పునాది వేశాడు. కేవలం ఒక్క పరుగుతో అర్ధశతకం చేజార్చుకున్నప్పటికీ, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పటిదార్ (13 బంతుల్లో 27), జితేశ్ శర్మ (9 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆర్సీబీ 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, అవేష్ ఖాన్ 2 వికెట్లు తీశారు.