తెలంగాణలో మండుతున్న ఎండలు... పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
- పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
- ఉదయం 9 నుంచి భానుడి భగభగ
- గురువారం నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో బుధవారం వడగాలులు వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర, దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువ కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.