బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
- లోక్‌భవన్ చేరుకుని గవర్నర్‌కు రాజీనామా అందజేత
- మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేబినెట్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడి
- రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్
నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలు కొనసాగారు. ఇటీవల ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా పలువురు బీజేపీ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో తొలిసారి ఆ పార్టీ ఈ పదవిని చేపట్టినట్లవుతుంది. అయితే ఇప్పటి వరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్ర సహాయమంత్రి నిత్యానందరాయ్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.