ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. స్పందించిన ప్రధాని మోదీ

Deeply Concerned PM Modi Reacts To Asha Bhosles Hospitalisation
ప్రముఖ సినీ గాయని, 92 ఏళ్ల ఆశా భోంస్లే అస్వస్థతకు గురయ్యారు. ప్ర‌స్తుతం ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన అలసట, ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా నిన్న‌ ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆశా భోంస్లే మనవరాలు, గాయని అయిన జానై భోంస్లే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. "మా నాయనమ్మ తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అందుకే ఆసుపత్రిలో చేర్చాం. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. దయచేసి మా ప్రైవసీని గౌరవించండి. అంతా బాగుంటుందని ఆశిస్తున్నాం. త్వరలోనే సానుకూల అప్‌డేట్‌తో మీ ముందుకు వస్తాం" అని ఆమె వివరించారు.

ఆశా భోంస్లే త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధాని మోదీ
ఈ విషయం తెలిసిన వెంటనే ప్ర‌ధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆశా భోంస్లే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. "ఆశా భోంస్లే గారు ఆసుపత్రిలో చేరారని తెలిసి చాలా ఆందోళన చెందాను. ఆమె మంచి ఆరోగ్యంతో, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆశా భోంస్లేకి చికిత్స కొనసాగుతోంది.
Go Back to Shorts
Asha Bhosle
Asha Bhosle health
Narendra Modi
Asha Bhosle hospitalized
Bollywood singer
Breech Candy Hospital
Janai Bhosle
chest infection
Indian singer

More Telugu News