తెలంగాణలో నేడు ఇంటర్ రిజల్ట్స్.. ఏపీలో ఎప్పుడంటే?

AP Intermediate Results Likely on 18th or 19th
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో నేడు ఫలితాలు విడుదలవుతుండటంతో ఏపీలోనూ దీనిపై చర్చ జోరుగా సాగుతోంది.

ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకనం (వాల్యుయేషన్) ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఫలితాల విడుదలకు సంబంధించిన డేటా ప్రాసెసింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 16 నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఫలితాల విడుదల తేదీపై ఇంటర్ బోర్డు అధికారికంగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫస్టియర్‌కు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకురావడంతో పరీక్షల నిర్వహణకు నెల రోజుల సమయం పట్టింది. ఈ కారణంగానే మూల్యాంకనం ఆలస్యమై, ఫలితాల విడుదలలో కొంత జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్నారు. అక్కడ పరీక్షలు ముగిసిన నెల రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తుండటం గమనార్హం.
Go Back to Shorts
AP Inter Results
Inter Results 2024
AP Intermediate Results
Andhra Pradesh Inter Results
TS Inter Results
Telangana Inter Results
AP Inter Exams
Board of Intermediate Education AP

More Telugu News