ప్రభుత్వ అప్పుల్లో భారీ తేడా ఉంది... గవర్నర్ జోక్యం చేసుకోవాలి: బొత్స
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పుల విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ తప్పుడు, అసంపూర్ణ సమాచారాన్ని శాసనమండలికి సమర్పించిందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు బుధవారం ఒక లేఖ రాశారు. ఫిబ్రవరిలో జరిగిన మండలి సమావేశాల్లో ఓ ప్రశ్నకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన సమాధానంలో వాస్తవ అప్పుల వివరాలు పూర్తిగా లేవని, గణాంకాలను తక్కువ చేసి చూపారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ కాపీని వైసీపీ మీడియాకు విడుదల చేసింది.
ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అప్పులు రూ. 60,485 కోట్లుగా పేర్కొన్నారని, అయితే కాగ్ (CAG) ఆడిట్ ప్రకారం వాస్తవ నికర అప్పులు రూ. 81,082 కోట్లుగా ఉన్నాయని బొత్స వివరించారు. ఈ రెండింటి మధ్య రూ. 20,500 కోట్లకు పైగా తేడా ఉందని, దీనికి సరైన కారణాలు కనిపించడం లేదని తెలిపారు. ఆర్‌బీఐ నుంచి తీసుకున్న 'వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సులు', పబ్లిక్ అకౌంట్ కింద ఉన్న డిపాజిట్లు, రిజర్వ్ ఫండ్స్ వంటి ముఖ్యమైన అంశాలను ప్రభుత్వం తన లెక్కల్లో కలపలేదని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా, 2025-26లో ఆఫ్-బడ్జెట్ రుణాలు ఏవీ లేవని ప్రభుత్వం చెప్పడం కూడా సరికాదన్నారు. మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు సమీకరించారని, ఇవి కూడా ప్రభుత్వ అప్పుల కిందకే వస్తాయని గుర్తుచేశారు. శాసనసభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని బొత్స అన్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని, తప్పుడు సమాధానాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే, ఈ తేడాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాధనానికి సంబంధించిన విషయాల్లో పారదర్శకత చాలా అవసరమని బొత్స తన లేఖలో స్పష్టం చేశారు.