ఇది భారత్ గర్వించదగిన క్షణం: సీఎం చంద్రబాబు
- కల్పక్కం అణు రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం
- ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్య
- భారత అణు కార్యక్రమం రెండో దశలో ఇది కీలక ముందడుగు అని వెల్లడి
- ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇంధన భద్రత సాధ్యమని ప్రశంస
ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ, "భారత అణు కార్యక్రమం రెండో దశలో ఇది ఒక కీలక ముందడుగు. ఈ విజయంతో మన దేశంలో ఉన్న విస్తారమైన థోరియం నిల్వలను మూడో దశలో వినియోగించుకోవడానికి మరింత చేరువయ్యాం" అని వివరించారు. ఈ పరిణామం దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు మార్గాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇంధన భద్రత దిశగా దేశం బలమైన అడుగులు వేస్తోందని చంద్రబాబు ప్రశంసించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో స్వయం సమృద్ధి సాధించడంలో ఇటువంటి విజయాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.