BC Janardhan Reddy: రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు... ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవతా దృక్పథం

BC Janardhan Reddy Responds to Road Accident Victims in Vijayawada
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధ దంపతులను ఆదుకుని, వారికి తక్షణ సహాయం అందించారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ (గన్నవరం)లోని పిన్నమనేని సిద్ధార్థ కాలేజీ సమీపంలోని ఫ్లై ఓవర్‌పై బైక్‌పై వెళ్తున్న వృద్ధ దంపతులను ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారికి గాయాలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన కాన్వాయ్‌లో అటుగా వెళ్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే స్పందించి, తన వాహనశ్రేణిని ఆపారు.

వెంటనే కారు దిగి బాధితుల వద్దకు వెళ్లి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే అంబులెన్స్‌ను రప్పించి, వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అనంతరం, ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ చేసి, ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.
 
Go Back to Shorts
BC Janardhan Reddy
Andhra Pradesh
Road Accident
Vijayawada
AP Minister
Gannavaram
Humanity
Elderly Couple

More Telugu News