Nellore Lemon: రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు

Nellore Lemon Price Hits Record High in Podalakur Market
షార్ట్స్‌లో చూడండి
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. నిన్న జరిగిన విక్రయాల్లో 80 కిలోల నిమ్మ బస్తా ఏకంగా రూ.10వేలు పలికి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. గత పదేళ్లలో ఇంతటి ధర ఎప్పుడూ చూడలేదని రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిలో నిమ్మ ధర రూ.125 వరకు పలకడంతో సాగుదారుల్లో ఆనందం వెల్లివిరిసింది.

కొద్ది నెలల క్రితం వరకు పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. మార్చి రెండో వారం వరకు కూడా గిట్టుబాటు ధర లేక నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. జనవరిలో కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. మార్కెటింగ్ శాఖ ద్వారా కిలో నిమ్మను రూ.8 చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ఇప్పుడు అదే నిమ్మకు భారీ డిమాండ్ ఏర్పడింది.

జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో అనేక మంది రైతులు నిమ్మ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మంచు, చలి వాతావరణం కారణంగా ఇంతకాలం ఎగుమతులకు ఆటంకం కలిగిందని, ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో ధరలు పెరుగుతున్నాయని ఎగుమతిదారులు తెలిపారు.
 
Go Back to Shorts
Nellore Lemon
Lemon Price
Lemon Farming
Podalakur
Andhra Pradesh
Lemon Market
Farmers Income
Record Price
Lemon Exports
Agricultural News

More Telugu News