R Krishnaiah: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్. కృష్ణయ్య హెచ్చరిక
తెలంగాణలో ఫీజు రీయింబర్సుమెంట్ సమస్యను పరిష్కరించకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టిస్తామని రాజ్యసభ సభ్యుడు ఆర్. కష్ణయ్య హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కలు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకోకూడదనే దురుద్దేశంతో ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు.
ఈ సమస్యను పరిష్కరించకుంటే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు బయట తిరగలేరని హెచ్చరించారు. అందరూ రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్సుమెంట్స్‌పై వందలసార్లు ధర్నాలు, పోరాటాలు చేశామని అన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులకు న్యాయం జరగాలని ఫీజురీయింబర్సుమెంట్స్ పథకం తీసుకువచ్చారని గుర్తు చేశారు.