Petroleum Ministry: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయా: కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే?

Will Petrol Diesel LPG Prices Increase Central Government Clarifies
షార్ట్స్‌లో చూడండి
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ, దేశీయ ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలలో సమీప భవిష్యత్తులో ఎలాంటి మార్పు ఉండబోదని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో వాణిజ్య సిలిండర్ ధర పెరిగిన విషయం తెలిసిందే. ఇతర దేశాల్లోని పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీనితో త్వరలో ధరలు పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులకు పాత ధరలకే ఇంధనం అందుబాటులో ఉంటుందని తెలిపింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలను పెంచే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది.

వాణజ్య సిలిండర్ ధర స్వల్పంగా పెరిగిందని, దీనివల్ల సాధారణ గృహ వినియోగదారులపై ప్రభావం పడదని తెలిపింది. వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగినప్పుడల్లా డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరుగుతాయనే అపోహ సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో రెండు నెలలకు సరిపడా పెట్రోలియం నిల్వలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
Go Back to Shorts
Petroleum Ministry
Petrol prices
Diesel prices
LPG prices
Fuel price hike
India fuel prices
Gas cylinder price

More Telugu News