RBI: బ్యాకింగ్ వ్యవస్థలోకి రూ.84 వేల కోట్లు ప్రవేశపెట్టిన ఆర్బీఐ
బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను (లిక్విడిటీ) పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం కీలక చర్యలు చేపట్టింది. రెండు వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలాల ద్వారా మొత్తం రూ.84,582 కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది. ఆర్థిక వ్యవస్థలో నిధుల ప్రవాహాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
తొలుత వీఆర్ఆర్ వేలంలో రూ.50,001 కోట్లను 5.44 శాతం వెయిటెడ్ యావరేజ్ రేటుకు విడుదల చేసింది. ఆ తర్వాత నిర్వహించిన మరో వేలంలో రూ.34,581 కోట్లను 5.30 శాతం వెయిటెడ్ యావరేజ్ రేటుకు బ్యాంకులకు అందించింది. మొదటి వేలానికి మంచి స్పందన రాగా, రెండో వేలానికి అడిగిన మొత్తం కంటే తక్కువ బిడ్లు దాఖలయ్యాయి.
ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో మార్చి 27 నాటికి సుమారు రూ.1.27 లక్షల కోట్ల మిగులు నిధులు ఉన్నాయని అంచనా. గత కొన్ని రోజులుగా వీఆర్ఆర్ వేలాల ద్వారా ఆర్బీఐ రూ.2,73,530 కోట్ల తాత్కాలిక ద్రవ్య లభ్యతను కల్పించింది. అంతకుముందు, 2026 జనవరి నుంచి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ల (ఓఎంఓ) ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి రూ.3.50 లక్షల కోట్ల శాశ్వత ద్రవ్య లభ్యతను పెంచింది.
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో (ఏప్రిల్-సెప్టెంబర్) చేపట్టనున్న రుణ సేకరణ వివరాలను ప్రకటించింది. ఆర్బీఐతో సంప్రదింపుల తర్వాత తొలి ఆరు నెలల్లో రూ.8.20 లక్షల కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ రుణాలను డేటెడ్ సెక్యూరిటీలు, సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ ద్వారా సేకరించనుంది.