Venkaiah Naidu: అమరావతి బిల్లుపై కేంద్రం ముందడుగు.. అమిత్ షాతో వెంకయ్య కీలక చర్చ!
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. ఈ అంశంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి కీలక చొరవ తీసుకున్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతి బిల్లుకు మోక్షం కలిగించేలా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయాలని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గట్టిగా కోరారు.
రాజధాని విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వెంకయ్య నాయుడు నొక్కిచెప్పారు. అమరావతికి చట్టపరమైన రక్షణ కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వాలు మారినా రాజధానిని మార్చే ప్రసక్తే ఉండదని, తద్వారా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయి భరోసా లభిస్తుందని అమిత్ షాకు వివరించారు.
వెంకయ్య నాయుడు ప్రతిపాదనలకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అమరావతి బిల్లుకు సంబంధించిన ముసాయిదాపై న్యాయశాఖ ఇప్పటికే తన కసరత్తు పూర్తి చేసిందని, త్వరలోనే దీనిని తుది నిర్ణయం కోసం కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పోలవరం నిధులు, విభజన హామీల అమలు వంటి ఇతర రాష్ట్ర ప్రయోజనాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం.