Yograj Singh: పార్టీలు, అమ్మాయిలు, రీల్స్.. అందుకే ఫెయిల్ అవుతున్నారు: యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ యువ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 52 పరుగులతో చెలరేగినప్పటికీ, అతని ఆటతీరు, వైఖరిపై యోగరాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అభిషేక్‌కు, శుభ్‌మన్ గిల్‌కు యువరాజ్ సింగ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, యోగరాజ్ వారిద్దరినీ వదలకుండా విమర్శించడం గమనార్హం.
ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ... "అభిషేక్ శర్మ ప్రదర్శన పట్ల నేను చాలా అసహనంగా ఉన్నాను. కొన్నిసార్లు అతనికి మెసేజ్‌లు కూడా పంపాను. ఆటను తేలికగా తీసుకోవద్దని చెప్పాను. కానీ అతను ఎప్పుడూ గాల్లోకి షాట్లు కొట్టి, సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాలని చూస్తాడు. ఆటలో సింగిల్స్, డబుల్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు డిఫెన్సివ్‌గా కూడా ఆడాలి. యువరాజ్ స్థాయికి చేరుకోవాలంటే అతనికి మరో జన్మ పట్టొచ్చు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆటగాళ్ల వైఫల్యానికి ఆఫ్-ఫీల్డ్ కార్యకలాపాలే కారణమని యోగరాజ్ ఆరోపించారు. "శుభ్‌మన్ గిల్‌కు, అభిషేక్‌కు ఏమైంది? పార్టీలు, అమ్మాయిలు, డబ్బు, నిరంతరం షూటింగ్‌లు.. మనసు వేరే చోట ఉన్నప్పుడే వైఫల్యం వస్తుంది. అభిషేక్ విషయంలో అదే జరుగుతోంది. రీల్స్ చేసుకుంటూ తిరుగుతున్నాడు, అది అతని పని కాదు. రాత్రి 9 గంటలకు పడుకుని, ఉదయం 5 గంటలకు లేచి వెయ్యి బంతులు ప్రాక్టీస్ చేయాలి" అని హితవు పలికారు.
అశ్విన్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు
ఇదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్‌పై కూడా యోగరాజ్ మండిపడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టులో అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం రాదని అశ్విన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గతంలో అర్జున్‌కు కొంతకాలం శిక్షణ ఇచ్చిన యోగరాజ్.. "అశ్విన్ ఒక చెత్త వాగుడు వాగుతున్నాడు. టీవీలో కూర్చుని ఒకరి గురించి అలా ఎలా మాట్లాడతాడు? అసలు నువ్వేంటి?" అని ప్రశ్నించారు. అర్జున్ ఒక మంచి బ్యాటర్ అని, వెన్నెముక సమస్య కారణంగా అతని బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదని తెలిపారు. "అర్జున్ బ్యాటింగ్ చేస్తుంటే సిక్సర్లు, బౌండరీలు బాదాడు. అతని కోచ్‌తో చెప్పాను.. మీకు చేతకాకపోతే అతడిని నాకు అప్పగించండి అని" అంటూ యోగరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.