Lakshmi Mittal: చంద్రబాబు విధానాలు భరోసానిచ్చాయి... ఇది లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రోత్ ఇంజిన్: లక్ష్మీ మిట్టల్
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రతిపాదిత ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్ మిట్టల్ మాట్లాడుతూ, ఈ పరిశ్రమ అనకాపల్లి ప్రాంతానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తుందని ప్రకటించారు.
తాను జన్మించిన భారతదేశంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టీల్ ప్లాంట్ నిర్మించడం గర్వంగా ఉందని మిట్టల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన 'ఆత్మనిర్భర్ భారత్', 'వికసిత్ భారత్' లక్ష్యాల సాధనలో ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అభివర్ణించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా ఈ ప్లాంట్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలలో విశ్వాసం నింపేలా ఏపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ప్రశంసించారు.
దేశ అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని వివరించారు. మౌలిక సదుపాయాలు, రక్షణ రంగ ఉత్పత్తులు సహా అనేక రంగాలకు అవసరమైన స్టీల్ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తామని చెప్పారు. 50 ఏళ్ల క్రితం తాము తొలి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, ఇప్పుడు అనకాపల్లిలో నిర్మించేది అత్యంత ఆధునిక ప్లాంట్‌గా నిలిచిపోతుందని మిట్టల్ పేర్కొన్నారు. ఈ భారీ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.