'రీల్' లైఫ్‌లోనైనా సీఎం అవుతా.. రేవంత్ రెడ్డిని నేనే ముఖ్యమంత్రిని చేశా: మల్లారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రీల్' లైఫ్‌లోనైనా సీఎం అవుతా.. రేవంత్ రెడ్డిని నేనే ముఖ్యమంత్రిని చేశా: మల్లారెడ్డి

Malla Reddy interest on CM post
  • వెండి తెరపై సీఎం రోల్ పోషించాలని ఉందన్న మల్లారెడ్డి
  • తాను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేనని వ్యాఖ్య
  • 'ఉస్తాద్ భగత్ సింగ్'లో తనకు విలన్ ఆఫర్ వచ్చిందని వెల్లడి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఖాయం. తాజాగా తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన మల్లన్న, తన మనసులోని అసలు కోరికను బయటపెట్టారు. రాజకీయంలో సీఎం ఎలాగూ కాలేను, కనీసం వెండితెరపై అయినా ముఖ్యమంత్రి పాత్ర పోషించాలని తనకు బలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాల్లో సీఎం రోల్ వస్తే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అలా అయినా తన కోరికను తీర్చుకుంటానని నవ్వుతూ చెప్పారు.


"రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డి తప్ప మరో పవర్‌ఫుల్ లీడర్ లేరని గతంలోనే చెప్పాను. ఒక రకంగా ఆయన్ను సీఎం చేసింది నేనే" అంటూ తనదైన శైలిలో చమత్కరించారు. రాజకీయాలు ఎలా ఉన్నా, తాను రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేనని ఆయన స్పష్టం చేశారు.


సినిమాలపై తనకున్న మక్కువను వివరిస్తూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో తనకు విలన్ పాత్ర ఆఫర్ వచ్చిందని మల్లారెడ్డి వెల్లడించారు. దర్శకుడు హరీశ్ శంకర్ స్వయంగా అడిగినప్పటికీ, విలన్ వేషం వేయడం ఇష్టం లేక తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. విలన్ కంటే తనకు సీఎం లాంటి పవర్‌ఫుల్ పాత్రల పైనే ఆసక్తి ఉందని ఆయన హింట్ ఇచ్చారు.

Advertisement
Malla Reddy
BRS
Revanth Reddy
Cogress
CM
Ustaad Bhagat Singh

More Telugu News