సేఫ్ జోన్ లో భారత్: కిషన్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సేఫ్ జోన్ లో భారత్: కిషన్ రెడ్డి

Kishan Reddy Says India is in Safe Zone
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక, అభివృద్ధితో పాటు శాంతిబాటలో నడుస్తోందన్న కిషన్ రెడ్డి
  • ప్రపంచం మొత్తం యుద్దభూమిలో ఉంటే భారతదేశం మాత్రం సేవ్ జోన్‍‌లో ఉందని వ్యాఖ్య
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక, అభివృద్ధితో పాటు శాంతిబాటలో నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
 
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ప్రపంచం మొత్తం యుద్దభూమిలో ఉంటే భారతదేశం మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో సేవ్ జోన్‍‌లో ఉందని అన్నారు.
Advertisement
Kishan Reddy
Narendra Modi
India
Tirumala
Lord Venkateswara
Spirituality
Development
Peace
Safe Zone
Ugadi

More Telugu News