Nayanthara: నయనతారపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు... మంచు విష్ణు స్పందన

Manchu Vishnu reacts to MPs comments on Nayanthara
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటి నయనతారపై తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సి.వి. షణ్ముగం చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజకీయ ప్రసంగాల్లోకి నటీనటుల పేర్లను లాగడంపై నటుడు మంచు విష్ణు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సినీ, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురంలో డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సభలో ఎంపీ షణ్ముగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రారంభించిన ‘మీ కలను చెప్పండి’ పథకాన్ని విమర్శిస్తూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "కలలు కనమని అబ్దుల్ కలాం అన్నారు. మన సీఎం స్టాలిన్ మీ కల చెప్పండి, నెరవేరుస్తామంటున్నారు. నాకు నయనతార కావాలని అడిగితే ఆయన నెరవేరుస్తారా? ఆమెను పెళ్లి చేసుకోవాలనే కల ఎవరికైనా ఉంటే తీరుస్తారా?" అంటూ ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై  నటుడు మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 'రాజకీయ ప్రచారంలోకి సంబంధంలేని నటీమణుల ప్రస్తావన తీసుకురావడం సరికాదు. పొలిటికల్ పంచ్‌ల కోసం నటీనటుల పేర్లను వాడుకోవడం తగదు. తెర వెనుక వారికంటూ గౌరవప్రదమైన, వ్యక్తిగత కుటుంబ జీవితం ఉంటుంది. వార్తల్లో హెడ్‌లైన్ల కోసం నటులను, ప్రత్యేకించి మహిళలను కించపరిచేలా మాట్లాడకూడదు' అని హితవు పలికారు. వివాదం ముదరడంతో, తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, పొరపాటున దొర్లాయని ఎంపీ షణ్ముగం వివరణ ఇచ్చారు.
 
Go Back to Shorts
Nayanthara
CV Shanmugam
Manchu Vishnu
Tamil Nadu Politics
Kollywood
actress
political speech
DMK government
MeToo
sexual harassment

More Telugu News