Gyanesh Kumar: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మోగిన ఎన్నికల నగారా... పూర్తి వివరాలు ఇవిగో!

Assembly Elections Announced for Four States and One Union Territory
దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ అన్ని ప్రాంతాల్లో మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

వివరాల్లోకి వెళితే, పశ్చిమ బెంగాల్‌లోని 294 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న తొలి దశ, ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ నిర్వహిస్తారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఇక అసోం (126), కేరళ (140), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రాజకీయ పార్టీల నేతలతో, ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి సలహాలు స్వీకరించామని జ్ఞానేశ్ కుమార్ వివరించారు. ఈ ఐదు ప్రాంతాల్లో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మే 4న జరిగే కౌంటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు..!

1. పశ్చిమ బెంగాల్ (మొత్తం స్థానాలు: 294) రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 
తొలి దశ: (152 స్థానాలకు ఎన్నికలు)
నోటిఫికేషన్: మార్చి 30 
నామినేషన్ల చివరి తేదీ: ఏప్రిల్ 6 
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 7 
ఉపసంహరణ చివరి తేదీ: ఏప్రిల్ 9 
పోలింగ్: ఏప్రిల్ 23 
ఓట్ల లెక్కింపు మే 4

రెండో దశ: (142 స్థానాలకు ఎన్నికలు)
నోటిఫికేషన్: ఏప్రిల్ 2 
నామినేషన్ల చివరి తేదీ: ఏప్రిల్ 9 
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 10 
ఉపసంహరణ చివరి తేదీ: ఏప్రిల్ 13 
పోలింగ్: ఏప్రిల్ 29
ఓట్ల లెక్కింపు మే 4

2. తమిళనాడు (మొత్తం స్థానాలు: 234) 
ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
నోటిఫికేషన్: మార్చి 30 
నామినేషన్ల చివరి తేదీ: ఏప్రిల్ 6 
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 7 ఉ
పసంహరణ చివరి తేదీ: ఏప్రిల్ 9 
పోలింగ్: ఏప్రిల్ 23
ఓట్ల లెక్కింపు మే 4

3. కేరళ (మొత్తం స్థానాలు: 140) 
ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 
నోటిఫికేషన్: మార్చి 16 
నామినేషన్ల చివరి తేదీ: మార్చి 23 
నామినేషన్ల పరిశీలన: మార్చి 24 
ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 26 
పోలింగ్: ఏప్రిల్ 9
ఓట్ల లెక్కింపు మే 4

4. అసోం (మొత్తం స్థానాలు: 126) 
ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 
నోటిఫికేషన్: మార్చి 16 
నామినేషన్ల చివరి తేదీ: మార్చి 23
 నామినేషన్ల పరిశీలన: మార్చి 24 
ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 26
 పోలింగ్: ఏప్రిల్ 9
ఓట్ల లెక్కింపు మే 4

5. పుదుచ్చేరి (మొత్తం స్థానాలు: 30) 
ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 
నోటిఫికేషన్: మార్చి 16 
నామినేషన్ల చివరి తేదీ: మార్చి 23
నామినేషన్ల పరిశీలన: మార్చి 24 
ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 26 
పోలింగ్: ఏప్రిల్ 9
ఓట్ల లెక్కింపు మే 4

Gyanesh Kumar
Assembly Elections 2024
Tamil Nadu Elections
Kerala Elections
West Bengal Elections
Assam Elections
Puducherry Elections
Indian General Elections
Election Commission of India
State Elections India

More Telugu News