Allu Sirish: తన భార్యపై ప్రశంసలు కురిపించిన అల్లు శిరీష్

Allu Sirish Praises His Wife Nayanka After Wedding
  • ప్రియురాలు నయనికను పెళ్లాడిన అల్లు శిరీష్
  • నయనిక తన కుటుంబ సభ్యులతో త్వరగా కలిసిపోయిందన్న శిరీష్
  • బన్నీ అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షించాడని వెల్లడి

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ తన వివాహం తర్వాత జీవితంలో చోటుచేసుకున్న మార్పులను, వేడుక విశేషాలను పంచుకున్నాడు. తన ప్రియురాలు నయనికను పెళ్లాడిన శిరీష్... వివాహానంతరం ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. నయనిక చాలా తెలివైనదని, తన కుటుంబ సభ్యులతో చాలా త్వరగా కలిసిపోయిందని సంతోషం వ్యక్తం చేశాడు. గతంలో ఎక్కడికి వెళ్లినా తన ఒక్కడికే ఖర్చు పెట్టుకునేవాడినని, ఇప్పుడు ఇద్దరి బిల్లులు కట్టాల్సి ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించాడు.


పెళ్లి వేడుకలో తన సోదరుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోషించిన పాత్ర గురించి శిరీష్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇంత పెద్ద వేడుకలో చిన్నపాటి పొరపాట్లు జరగడం సహజమని, వాటిని పట్టించుకోకుండా ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని బన్నీ ఇచ్చిన సలహా తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. అల్లు అర్జున్ స్వయంగా పెళ్లి పనులన్నీ దగ్గరుండి పర్యవేక్షించాడని, వేడుక ముగిసే వరకు అక్కడే ఉండి అన్ని బాధ్యతలు నెరవేర్చాడని శిరీష్ గుర్తు చేసుకున్నాడు.


అంతేకాకుండా, టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం కూడా తన పెళ్లికి కొన్ని రోజుల ముందే జరిగిందని... విజయ్ సొంత పనుల ఒత్తిడిలో ఉండి కూడా తన వివాహ వేడుకకు హాజరై తన స్నేహాన్ని చాటుకున్నారని తెలిపాడు.

Allu Sirish
Nayanka
Allu Arjun
Vijay Deverakonda
Rashmika Mandanna
Telugu Cinema
Tollywood
Marriage
Wedding
Celebrity Wedding

More Telugu News