Abhishek Sharma: నాపై నాకే అనుమానం వచ్చింది.. కానీ వాళ్లు నమ్మారు: అభిషేక్ శర్మ
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ హీరో అభిషేక్ శర్మ భావోద్వేగం
- టర్నమెంట్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డానన్న యువ ఓపెనర్
- కష్టకాలంలో జట్టు సభ్యులు అండగా నిలవడం మర్చిపోలేనని వ్యాఖ్య
భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టోర్నీలో తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి పంచుకున్నాడు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడాడు. టోర్నమెంట్లో వరుసగా విఫలమవుతున్నప్పుడు తనపై తనకే అనుమానం కలిగిందని, కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనపై ఉంచిన అచంచలమైన విశ్వాసమే తనను గెలిపించిందని భావోద్వేగంగా చెప్పాడు.
"టోర్నీ మధ్యలో నా ప్రదర్శనపై నాకే సందేహాలు వచ్చాయి. నా కెరీర్లో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. కానీ, కోచ్, కెప్టెన్ నాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. 'నువ్వు ఏదో ఒక పెద్ద మ్యాచ్ గెలిపిస్తావు' అని వారు పదేపదే చెబుతూ ఉండేవారు. ఒక యువ ఆటగాడిగా ఇలాంటి దశను దాటడం అంత సులభం కాదు" అని అభిషేక్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ తెలిపాడు.
"ఈ జట్టు నాకు ఎంతో ప్రేమను పంచింది. నేను సరిగా ఆడలేకపోయిన రోజుల్లో వారు నన్ను చూసుకున్న విధానం అద్భుతం. టోర్నీకి ముందు ఏడాది పొడవునా బాగా ఆడి, కీలకమైన ప్రపంచకప్‌లో విఫలమవడంతో ఒత్తిడికి గురయ్యాను. కొన్నిసార్లు భావోద్వేగానికి కూడా లోనయ్యాను. నేను కెప్టెన్ లేదా కోచ్‌తో మాట్లాడదాం అనుకునేలోపే వారే నా దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పేవారు" అని వివరించాడు.
"‘నువ్వు మాకు పెద్ద మ్యాచ్ గెలిపిస్తావు’ అని వారు చెప్పిన మాటలు నా మదిలో నిలిచిపోయాయి. ఆ రోజు కోసం ఎదురుచూశాను. ఫైనల్ కంటే గొప్ప రోజు మరొకటి ఉండదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది" అని అభిషేక్ పేర్కొన్నాడు.