Allu Arjun: భార్య స్నేహారెడ్డికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్
- ఖరీదైన బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన అల్లు అర్జున్
- కుటుంబ సభ్యుల సమక్షంలో తాళాలు అందజేత
- 15 ఏళ్ల క్రితం అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వివాహం
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి అత్యంత ఖరీదైన బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. తమ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ బహుమతిని ఇచ్చి భార్యను సర్ప్రైజ్ చేశారు. 2011 మార్చి 6వ తేదీన వీరిద్దరు వివాహం చేసుకున్నారు. నిన్న (మార్చి 6) సోదరుడు అల్లు శిరీష్ వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ వివాహం కూడా ఇదే తేదీన జరిగింది.
తన భాగస్వామికి గుర్తుండిపోయేలా అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, కుమారుడు అల్లు అయాన్ల సమక్షంలో కారు తాళాలను స్నేహారెడ్డికి అందించారు. భర్త ఇచ్చిన ఖరీదైన సర్ప్రైజ్ గిఫ్ట్‌తో స్నేహారెడ్డి ఉబ్బితబ్బిబ్బయ్యారు. కుటుంబ సభ్యులు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.