Masoud Pezeshkian: గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్
- గల్ఫ్ దేశాలపై ఇకపై దాడులు జరగబోవన్న ఇరాన్ అధ్యక్షుడు
- దాడులతో ఇరాన్ తోకముడిచిందన్న డొనాల్డ్ ట్రంప్
- మధ్యప్రాచ్యాన్ని ఇక ఇరాన్ బెదిరించబోదని వ్యాఖ్య
- మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన దేశంగా ఇరాన్‌ను అభివర్ణించిన ట్రంప్
ఇజ్రాయెల్-అమెరికాతో యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులకు గాను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు. ఇకపై గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని స్పష్టం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తోక ముడిచిందని అన్నారు. ఇకపై ఆ దేశం పొరుగువారిపై బెదిరింపులకు పాల్పడబోదని అన్నారు. మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ ఇక బెదిరించలేదని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ను మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన దేశంగా (లూజర్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్) డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు.
పశ్చిమాసియాను గుప్పిట్లో పెట్టుకుని, పాలించాలని ఇరాన్ చూసిందని అన్నారు. ఇప్పుడు ఇరాన్ ఓడిపోయిందని, ఆ దేశం లొంగిపోవడమో లేదా కుప్పకూలిపోవడమో జరిగే వరకు దశాబ్దాలపాటు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని అన్నారు. ఈరోజు ఇరాన్‌పై భీకర దాడులు జరుగుతున్నాయని, ఈ దేశం దుష్ప్రవర్తన కారణంగా అక్కడి ప్రాంతాలను కూడా సర్వనాశనం చేసే అంశం పరిశీలనలో ఉందని ట్రంప్ అన్నారు.