రూ.35,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన జీహెచ్ఎంసీ అధికారి
- సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పట్టుకున్న ఏసీబీ
- అకౌంట్స్ విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సంతోష్
- పెన్షన్ ప్రాసెస్ చేయడానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేసిన సంతోష్
ఈ సందర్భంగా ఏసీబీ ప్రజలకు సూచన జారీ చేసింది. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడైనా లంచం అడిగినట్లయితే అవినీతి నిరోధక శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని తెలిపింది. అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలు వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (TelanganaACB), వెబ్ సైట్ (http://acb.telangana.gov.in ) ద్వారా కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించవచ్చని సూచించింది. ఫిర్యాదుధారుల లేదా బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.