Nitish Kumar: ముగిసిన నితీశ్ శకం.. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఎవరెవరు ఉన్నారంటే..?

Nitish Kumar Era Ends Who is in Bihar Chief Minister Race
  • రాజ్యసభకు నామినేషన్ వేసిన నితీశ్ కుమార్
  • బీహార్ సీఎం పదవిని చేపట్టబోతున్న బీజేపీ!
  • సీఎం రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద రాయ్, దిలీప్ జైశ్వాల్

బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన నితీశ్ కుమార్, రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుని జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో, బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.


ప్రస్తుత అంచనాల ప్రకారం, కొత్త ప్రభుత్వంలో బీజేపీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోనుంది. ఈ రేసులో ప్రధానంగా ముగ్గురు నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారు ఎవరంటే...?

  • సామ్రాట్ చౌదరి: ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి సీఎం రేసులో అందరికంటే ముందున్నారు. ఓబీసీ (కుష్వాహా) సామాజికవర్గానికి చెందిన ఆయనకు పార్టీలో, ప్రభుత్వంలో పట్టు ఉండటం ప్లస్ పాయింట్.

  • నిత్యానంద రాయ్: కేంద్ర మంత్రిగా ఉన్న నిత్యానంద రాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. యాదవ సామాజికవర్గానికి చెందిన ఈయనను సీఎంగా చేయడం ద్వారా, ఆర్జేడీ (తేజస్వి యాదవ్) ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని బీజేపీ భావిస్తోంది. అమిత్ షాతో నిత్యానంద రాయ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

  • దిలీప్ జైశ్వాల్: బీహార్ మంత్రి దిలీప్ జైశ్వాల్ పేరు కూడా పరిశీలనలో ఉంది. వైశ్య సామాజికవర్గానికి చెందిన ఈయనకు పార్టీ అధిష్ఠానం వద్ద మంచి గుర్తింపు ఉంది.

Nitish Kumar
Bihar politics
Bihar Chief Minister
Samrat Choudhary
Nityanand Rai
Dilip Jaiswal
BJP
Bihar government
Tejaswi Yadav
Bihar elections

More Telugu News